వీర సైనికుల పిల్లల చదువు బాధ్యత నాదే


Sun,February 17, 2019 02:05 AM

Sehwag
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రవాద దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు జాతి మొత్తం మేమున్నామంటూ మద్దతుగా నిలుస్తున్నది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల పిల్లల పట్ల భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన సహృదయతను చాటుకున్నాడు. కన్నవాళ్లను కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న సైనికుల కుటుంబాలకు బాసటగా నిలిచాడు. వీరసైనికుల పిల్లల చదవుకయ్యే పూర్తి ఖర్చును తాను భరిస్తానంటూ సెహ్వాగ్ శనివారం ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల కుటుంబాలకు అండగా నిలుద్దాం. ఉగ్రదాడిలో మరిణించిన సీఆర్పీఎఫ్ వీర జవాన్ల పిల్లల చదువు బాధ్యతను నేను తీసుకుంటున్నాను. వారంతా నా ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకోవచ్చు అని వీరూ ట్వీట్ చేశాడు.

479

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles