సవిటీ బూరకు స్వర్ణం


Wed,June 13, 2018 01:05 AM

savity
న్యూఢిల్లీ: భారత బాక్సర్ సవిటీ బూర... ఉమ్నఖోవ్ స్మారక టోర్నీలో స్వర్ణంతో మెరిసింది. మంగళవారం జరిగిన 75 కేజీల మిడిల్ వెయిట్ ఫైనల్లో సవిటీ.. అన్నా అఫ్నోజెనెవా (రష్యా)పై ఏకపక్షంగా గెలిచింది. బౌట్ ఆద్యంతం భారత అమ్మాయి పదునైన పంచ్‌లతో విరుచుకుపడింది. పురుషుల విభాగంలో బ్రిజేశ్ యాదవ్ (81 కేజీ), వీరేందర్ కుమార్ (91కేజీ) ఫైనల్లో తమ ప్రత్యర్థుల చేతుల్లో ఓడి రజతాలను కైవసం చేసుకున్నారు. అంతకుముందు జరిగిన సెమీస్ బౌట్లలో పింకి జాంగ్రా (51 కేజీ), పవిత్ర (60 కేజీ).. తమ ప్రత్యర్థుల చేతిలో ఓడి కాంస్యాలతో సరిపెట్టుకున్నారు. పురుషుల విభాగంలో ప్రపంచ కాంస్య విజేత గౌరవ్ బిధురి (56 కేజీ) కూడా కాంస్యంతోనే సంతృప్తిపడ్డాడు.

683

More News

VIRAL NEWS