సాతియాన్‌కు కాంస్యం


Mon,March 25, 2019 01:34 AM

Sathiyan
మస్కట్: ఒమన్ టీటీ ఓపెన్‌లో సాతియాన్ కాంస్య పతకంతో సంతృప్తిపడ్డాడు. ఆదివారం జరిగిన సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ సాతియాన్‌న 8-11, 11-7, 9-11, 11-9, 9-11, 11-9, 10-12 తేడాతో మతియస్ ఫ్లాక్(స్వీడన్) చేతిలోఓటమిపాలయ్యాడు. సాతియాన్, ఫ్లాక్ మధ్య పోరు హోరాహోరీగా సాగింది. చేరో గేమ్ గెల్చుకుంటూ పోవడంతో మ్యాచ్ ఏడు గేమ్‌లకు దారితీసింది. ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడటంతో ఆఖరి దాకా ఉత్కంఠగా సాగింది.

ఆరు గేముల్లో చెరో మూడు గెలుచుకోవడంతో ఆఖరిదైన ఏడో గేమ్‌లో రెండు పాయింట్ల తేడాతో సాతియాన్ మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. మరోవైపు శరత్ కమల్ 1-4తో పుకార్ తమిస్లోవ్(క్రొయేషియా) చేతిలో ఓడి నిరాశపరిచాడు. మహిళల సింగిల్స్‌లో మధురిక పట్కర్, రితి శంకర్ ప్రధాన రౌండ్‌కు అర్హత సాధించలేకపోయారు. అండర్-21 మహిళల సింగిల్స్ ఫైనల్లో అర్చనా కామత్ 7-11, 8-11, 6-11 తేడాతో సత్యుకీ ఒడో(జపాన్) చేతిలో ఓడి రజత పతకం సాధించింది.

151

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles