జాతీయ పోటీలకు సరూర్‌నగర్ స్కేటర్లు


Mon,November 11, 2019 03:34 AM

skating
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇటీవల జరిగిన ఆరవ అంతర్‌జిల్లా రోలర్, ఇన్‌లైన్ స్కేటింగ్ పోటీల్లో సరూర్‌నగర్ స్టేడియం క్రీడాకారులు సత్తా చాటారు. రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డిసెంబర్‌లో విశాఖపట్టణంలో జరిగే జాతీయస్థాయి పోటీలకు 8 మంది ఎంపికయ్యారు. సీనియర్ విభాగంలో సాయితేజ, అండర్-17 విభాగంలో చరితాదేవి, అండర్-14 విభాగంలో అనన్య, అభివన్ కుమార్, అండర్-7లో నిషితారెడ్డి చోటు దక్కించుకున్నారు. జాతీయ పోటీల్లో పాల్గొన నున్న క్రీడాకారులను కోచ్ కె యాదయ్య, రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ మోహన్‌రెడ్డి అభినందించారు.

109

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles