శాంసన్ రికార్డుల డబుల్


Sun,October 13, 2019 12:26 AM

Sanju
బెంగళూరు: భారత యువ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ విశ్వరూపం ప్రదర్శించాడు. దేశవాళీ వన్డే టోర్నీ
విజయ్ హజారే ట్రోఫీలో కేరళ తరఫున అజేయ ద్విశతకం సాధించడంతో పాటు లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు నమోదు చేశాడు. శనివారం ఇక్కడ గోవాతో జరిగిన మ్యాచ్‌లో శాంసన్ 129 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 212 పరుగులు చేయడంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ మూడు వికెట్లు కోల్పోయి 377 పరుగుల భారీ స్కోరు చేసింది. అతడికి తోడు సచిన్ బేబి (135బంతుల్లో 127) శతకంతో రాణించాడు. భారీ లక్ష్యఛేదనలో చతికిలపడ్డ గోవా 50 ఓవర్లలో 273పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కేరళ 104 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. లిస్ట్-ఏ క్రికెట్‌లో ద్విశతకం చేసిన ఎనిమిదో భారతీయుడిగా శాంసన్ నిలిచాడు. అలాగే లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన వికెట్ కీపర్‌గా ఇంతకాలం ఉన్న పాక్ ఆటగాడు అబీద్ అలీ (209) కూడా వెనక్కినెట్టి శాంసన్ అగ్రస్థానంలో నిలిచాడు. అత్యంత వేగంగా 200 మార్కును అందుకున్న భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డులకు ఎక్కడంతో పాటు మూడో స్థానంలో వచ్చి డబుల్ సెంచరీ చేసిన ఏకైక భారత ఆటగాడిగానూ ఘనత సాధించాడు.

447

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles