హెచ్‌సీఏ రిటర్నింగ్ అధికారిగా సంపత్


Mon,July 22, 2019 02:42 AM

HCA
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కొత్త కార్యవర్గ ఎన్నికలను ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించాలని వార్షిక సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వీఎస్ సంపత్, అంబుడ్స్‌మన్‌గా జస్టిస్ ఎంఎన్ రావు, బీసీసీఐ ప్రతినిధిగా జి. వివేకానందను నియమిస్తూ తీర్మానం చేశారు. ఆదివారం ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు అనిల్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణలోని అన్ని జిల్లాలకు పూర్తి స్థాయి క్లబ్‌లను ఏర్పాటు చేయాలని హెచ్‌సీఏ మాజీ సభ్యుడు బాబురావు డిమాండ్ చేశారు. తీవ్ర తర్జనభర్జనల మధ్య సాగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రాగా.. చివరకు 9 అంశాలకు హెచ్‌సీఏ కార్యవర్గం ఆమోదం తెలిపింది.

251
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles