సాజన్ భన్వాల్‌కు రజతం


Thu,September 20, 2018 12:48 AM

sajan
న్యూఢిల్లీ: భారత యువ రెజ్లర్ సాజన్ భన్వాల్ అరుదైన రికార్డు అందుకున్నాడు. ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ వరుస ఏడాదుల్లో పతకాలు సాధించిన తొలి భారత రెజ్లర్‌గా సాజన్ రికార్డుల్లోకెక్కాడు. స్లోవేకియా వేదికగా జరిగిన ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ టోర్నీ పురుషుల 77కిలోల గ్రీకో-రోమన్ విభాగంలో సాజన్ రజత పతకంతో ఆకట్టుకున్నాడు. ఇస్లాం ఒపియేవ్(రష్యా)తో జరిగిన పసిడి పతక బౌట్‌లో 0-8తో సాజన్ ఓటమిపాలయ్యాడు. ఆది నుంచి జోరు కనబరిచిన రష్యా రెజ్లర్.. భన్వాల్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తనదైన పట్టుతో కీలక పాయింట్లు కొల్లగొడుతూ బౌట్‌ను కైవసం చేసుకున్నట్లు యూనైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది ఫిన్‌లాండ్‌లో జరిగిన జూనియర్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఈ 20 ఏండ్ల హర్యానా రెజ్లర్ కాంస్య పతకం అందుకున్నాడు.

234

More News

VIRAL NEWS