టార్గెట్ దుబాయ్!


Tue,November 14, 2017 02:09 AM

-నేటి నుంచి చైనా ఓపెన్ సూపర్ సిరీస్
-బరిలోకి దిగుతున్న సైనా, ప్రణయ్
saina
పుజో(చైనా): భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, హెచ్‌ఎస్ ప్రణయ్ గెలుపు జోరు మీదున్నారు. ఇటీవలి జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్ టైటిళ్లు దక్కించుకున్న సైనా, ప్రణయ్..దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్ టోర్నీకి అర్హత సాధించడమే లక్ష్యంగా ఎంచుకున్నారు. ఈ సీజన్‌కు ఆఖరి టోర్నీ అయిన దుబాయ్ సిరీస్‌లో టాప్-8 ర్యాంకింగ్స్‌లో ఉన్న క్రీడాకారులకు మాత్రమే అర్హత దక్కుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి మొదలయ్యే చైనా ఓపెన్ సూపర్ సిరీస్‌తో పాటు ఆ తర్వాత జరిగే హాంకాంగ్ ఓపెన్‌లో సత్తాచాటితే దుబాయ్ టోర్నీకి అర్హత సాధించే అవకాశముంటుంది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో ఉన్న సైనా..తన తొలి మ్యాచ్‌లో బీవెన్ జాంగ్(అమెరికా)తో తలపడనుంది. మరోవైపు ప్రణయ్ మొదటి రౌండ్‌లో క్వాలిఫయర్‌ను ఢీకొననున్నాడు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రజతంతో పాటు ఇండియా, కొరియా ఓపెన్ టైటిళ్లు గెలిచిన పీవీ సింధు..సయాకా సటోతో తన తొలి పోరును మొదలుపెట్టనుంది. తొలి రెండు రౌండ్ల ను అధిగమిస్తే..జపాన్ స్టార్ నొజోమీ ఒకుహర ఎదురుపడే అవకాశముంది. పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ బరిలో ఉండగా, మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా, సిక్కీరెడ్డి, పురుషుల డబుల్స్‌లో మను అత్రి, సుమిత్‌రెడ్డి, సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టి పోటీలో ఉన్నారు. మహిళల డబుల్స్‌లో జాతీయ చాంపియన్స్ అశ్వినీ పొనప్ప, సిక్కీరెడ్డి..తమ తొలి మ్యాచ్‌లో కొరియా ద్వయంతో తలపడుతారు.
pranoy

314

More News

VIRAL NEWS