అమర జవాన్ల కుటుంబాలకు సచిన్ మద్దతు


Fri,February 22, 2019 01:07 AM

-పుష్ అప్ చాలెంజ్ ద్వారా విరాళాల సేకరణ
sachin
ముంబై: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకునుందుకు సచిన్ తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగే ఫుల్ మారథాన్ ద్వారా అమరుల కుటుంబాల కోసం విరాళాల సేకరించాలని ఐడీబీఐ భావిస్తున్నది. దాదాపు 18,000 మంది రన్నర్లు ఈ రేస్‌లో పాల్గొంటున్నారు. నాలుగు విభాగాలుగా జరిగే ఈ రేస్‌కు ముందు కీప్ మూవింగ్ పుషప్ చాలెంజ్‌లో భాగంగా సచిన్ 5 నుంచి 10 పుషప్‌లను తీయనున్నాడు. ఈ చాలెంజ్‌లో సచిన్‌తోపాటు రన్నర్లు కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రతి రన్నర్‌కు వంద రూపాయల చొప్పున ఐడీబీఐ అమరుల కుటుంబానికి చెల్లించనుంది. దీంతో ఈ మారథాన్‌లో పాల్గొని అమరుల కుటుంబాలకు బాసటగా నిలువాలని ఐడీబీఐ బ్రాండ్ అంబాసిడర్ సచిన్ పిలుపునిచ్చాడు.

583

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles