అలా లేచి వెళ్లిపోయింది..!


Wed,May 16, 2018 12:58 AM

sachin_farewell
ముంబై: భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మైదానంలో ఆడుతున్నాడంటే ప్రతి ఒక్కరు టీవీలకు అతుక్కుపోతారు. ఇక గ్రౌండ్‌లో ఉన్నవాళ్లయితే కండ్లార్పకుండా ఆ క్లాసిక్ షాట్స్‌ను తనివితీరా ఆస్వాదిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది మాస్టర్ బ్యాటింగ్ కోసం ఎదురుచూస్తే.. అతని భార్య అంజలి వ్యవహారం మాత్రం దీనికి పూర్తి భిన్నం. సచిన్ ఆడుతుంటే అంజలి ఎప్పుడూ గ్యాలరీలో కూర్చొని మ్యాచ్ చూడలేదంట. ఈ విషయాన్ని మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు. అంజలి ఎప్పుడూ మైదానానికి వచ్చి నా మ్యాచ్ చూడలేదు. దీనికి కూడా ఓ కారణం ఉంది. 2004లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో బాక్సింగ్ టెస్టు జరుగుతుంది. దీనిని చూడటానికి తొలిసారి అంజలి మైదానానికి వచ్చింది. కానీ బ్రెట్ లీ వేసిన మొదటి బంతికే నేను ఔటయ్యా. ఆ వెంటనే గ్యాలరీలో ఉన్న అంజలి అక్కడ్నించి వెళ్లిపోయింది. ఇక అప్పట్నించి ఇప్పటిదాకా మళ్లీ గ్రౌండ్‌కి రాలేదు. నేను మ్యాచ్‌లు ఆడుతున్నా.. ఇంట్లో ఒకే చోట కూర్చోని చూస్తుంది. పక్కకు కూడా కదలదు. ఏదో నమ్మకంతోనే ఇదంత చేస్తుందనుకుంటా. చివరిసారి ఆమె మైదానానికి వచ్చింది 14 నవంబర్ 2013లో. ఎందుకంటే అది నా చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో కుటుంబంతో కలిసి వచ్చింది అని సచిన్ వివరించాడు. మామూలుగా క్రికెటర్లతో పాటు వెళ్లే భార్యలు కచ్చితంగా గ్యాలరీలో కేరింతలు కొడుతూ లేదంటే టెన్షన్ పడుతూ రెగ్యులర్‌గా దర్శనమిస్తూనే ఉంటారు.

572

More News

VIRAL NEWS

Featured Articles