20న అంబుడ్స్‌మన్ ముందు సచిన్, లక్ష్మణ్


Wed,May 15, 2019 08:33 AM

sachin
న్యూఢిల్లీ: పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ ఈనెల 20న బీసీసీఐ అంబుడ్స్‌మన్ జస్టిస్ డీకే జైన్ తిరిగి హాజరుకానున్నారు. సంజీవ్ గుప్తా ఫిర్యాదు మేరకు డీకే జైన్ ముందు సచిన్, లక్ష్మణ్ మంగళవారం హాజరై తమ వాదనలు వినిపించారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఎలా పొందుతున్నారో రాత పూర్వక వివరించాలంటూ కోరిన నేపథ్యంలో సచిన్, లక్ష్మణ్ మూడు గంటలకు పైగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. క్రికెట్ సలహాదారుల కమిటీ(సీఏసీ)లో కొనసాగుతూ ముంబై, హైదరాబాద్ ఫ్రాంచైజీలకు ఈ మాజీ క్రికెటర్లు మెంటార్‌గా వ్యవహరించడంపై తమ వాదనలను జైన్‌కు వివరించారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుత్నునట్లు తేలితే సీఏసీ నుంచి వైదొలిగేందుకు సిద్ధమని లక్ష్మణ్, తాను స్వచ్చందంగా పనిచేస్తున్నట్లు సచిన్ ఇది వరకే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 20న ఏం జరుగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.

205

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles