రోహిత్‌ టెస్టుల్లోనూ రాణిస్తాడు: రాథోడ్‌


Wed,September 18, 2019 01:20 AM

మొహాలీ: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దుమ్మురేపుతున్న ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ కుదురుకుంటే టెస్టుల్లోనూ టీమ్‌ఇండియాకు తిరుగుండదని బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ పేర్కొన్నాడు. సంజయ్‌ బంగర్‌ స్థానంలో ఇటీవలే బ్యాటింగ్‌ కోచ్‌గా ఎంపికైన రాథోడ్‌.. హిట్‌మ్యాన్‌ శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి నమ్మకముందన్నాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్‌లలో ఆడటంలేని అత్యుత్తమ ప్లేయర్‌ రోహిత్‌ అని కొనియాడాడు. ‘ఏ ఫార్మాట్‌లోనైనా రోహిత్‌ అత్యుత్తమ ఆటగాడే. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అతడేంటో ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. టెస్టు ఓపెనర్‌గా తగినన్ని అవకాశాలు లభిస్తే అక్కడ కూడా సత్తాచాటగలడు. టెస్టుల్లో రోహిత్‌ కుదురుకుంటే.. జట్టుకు ఎంతో మేలు జరుగుతుంది. తొలి టెస్టులో ఆడే ఆటగాళ్ల జాబితాపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుంది’ అని రాథోడ్‌ వివరించాడు.

422

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles