సెమీస్‌లో ఫెదరర్ X నాదల్


Thu,July 11, 2019 03:08 AM

-జొకోవిచ్, అగట్ ముందడుగు
roger
లండన్: వింబుల్డన్ గ్లాండ్‌స్లామ్ టోర్నీలో స్థాయికి తగ్గ ప్రదర్శనతో అదరగొడుతున్న రెండో సీడ్, స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. బుధవారమిక్కడ జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఫెదరర్ 4-6, 6-1, 6-4, 6-4 తేడాతో కీ నిషికోరి(జపాన్)పై చెమటోడ్చి విజయం సాధించాడు. వింబుల్డన్‌లో రోజర్‌కు ఇది వందో గెలుపు కావడం విశేషం. అలాగే ఒకే గ్రాండ్‌స్లామ్ చరిత్రలో సెంచరీ విజయాలు సాధించిన ఏకైక ఆటగాడిగానూ స్విస్ దిగ్గ జం చరిత్ర లిఖించాడు. రెండున్నర గంటలపాటు సాగిన మ్యాచ్‌లో 12 ఏస్‌లు కొట్టిన ఫెదరర్.. 55 విన్నర్లను సాధించాడు. మరోమ్యాచ్‌లో డేవిడ్ గొఫిన్(బెల్జియం) పై 6-4, 6-0, 6-2 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించిన టాప్‌సీడ్ నొవాక్ జొకోవిచ్ కూడా సెమీస్‌కు దూసుకెళ్లాడు.

ఓవరాల్‌గా ఈ టోర్నీ సెమీస్‌కు చేరుకోవడం సెర్బియా వీరుడికిది ఎనిమిదోసారి. స్పెయిన్ స్టార్, మూడో సీడ్ రఫెల్ నాదల్.. అన్‌సీడెడ్ ప్లేయర్ సామ్ క్వెరీని మట్టికరిపించి సెమీస్‌లో అడుగుపెట్టి సింహనాదం చేశాడు. 2గంటల ఏడు నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌ను 7-5, 6-2, 6-2తో వరుస సెట్లలో గెలిచి సత్తా చాటాడు. మొత్తంగా 10 ఏస్‌లను కొట్టిన రఫా 44 విన్నర్లతో అదరగొట్టాడు. సెమీస్‌లో రెండో సీడ్ ఫెదరర్‌తో తలపడనున్నాడు. మరో క్వార్టర్స్‌లో గిడో పెల్లా(అర్జెంటీనా)పై 7-5, 6-4, 3-6, 6-3 తేడాతో బాటిస్టా అగట్(స్పెయిన్) గెలుపొంది, ముందడుగేశాడు. పురుషుల సింగిల్స్ సెమీస్ మ్యాచ్‌లు శుక్రవారం జరుగుతాయి.

నేటి మహిళల సెమీస్‌లో..


సెరీనా X స్ట్రికోవా
హలెప్ X స్విటోలినా

సెమీస్‌లో..


ఫెదరర్ X నాదల్
జొకోవిచ్ X బాటిస్టా అగట్

279

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles