వికెట్ కీపర్‌గా పంత్..


Tue,October 22, 2019 12:54 AM

రెండో ఇన్నింగ్స్‌లో కీపింగ్ చేస్తుండగా వృద్ధిమాన్ సాహా వేలికి గాయమైంది. దీంతో అతడి స్థానంలో పంత్ వికెట్ల వెనుక దర్శనమిచ్చాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 27వ ఓవర్‌లో అశ్విన్ వేసిన బంతి అనూహ్యంగా బౌన్స్ అయి సాహా చేతి వేళ్ల కొసలకు తాకింది. దీంతో విలవిలలాడిన అతడు ఫిజియో సూచన మేరకు ఫీల్డ్ నుంచి బయటకు వెళ్లాడు. అతడి స్థానంలో పంత్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. సాహా గాయం తీవ్రతపై మంగళవారం ఉదయం ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. కాగా.. గతంలో వికెట్ కీపర్ గాయపడితే అతడి బదులు మరో కీపర్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చే అవకాశం లేకపోయేది. జట్టులోని మరే ఆటగాడైనా ఆ బాధ్యతలు మోయా ల్సి ఉండేది. కానీ ప్రస్తుతం సవరించిన నిబంధనల ప్రకారం ఐసీసీ సబ్‌స్టిట్యూట్‌కు కీపింగ్ చేసే వెసులుబాటు కల్పించింది.

1325

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles