ప్రతి ఒక్కరు బాధ్యతతో ఆడారు


Sun,May 12, 2019 01:20 AM

Shreyas
విశాఖపట్నం: గతానికి భిన్నంగా ఈ సీజన్‌లో ప్రతి ఒక్కరు బాధ్యతతో ఆడారని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అన్నాడు. ఏడేండ్ల తర్వాత తొలిసారి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ఢిల్లీ..డిఫెండింగ్ చాంపియన్ చెన్నైతో జరిగిన క్వాలిఫయర్-2లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయ్యర్ పలు అంశాలపై మాట్లాడాడు. ఈ సీజన్‌లో చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. సీజన్‌కు ముందు చీఫ్ కోచ్ రికీ పాంటింగ్, సలహాదారు గంగూలీ వారి వారి సలహాలు, సూచనలు, స్ఫూర్తి నింపే మాటలతో మేము రంగంలోకి దిగాం. ముంబైతో తొలి మ్యాచ్‌లో రిషబ్ పంత్ దూకుడైన ఇన్నింగ్స్‌తో మొదలుపెడితే..ప్రతి మ్యాచ్‌లో బాధ్యతను గుర్తెరుగుతూ జట్టు విజయాల్లో పాలుపంచుకున్నారు. లీగ్ దశలో మేము అద్భుతంగా రాణించాం. ఈ సీజన్‌లో మా ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. వచ్చే సీజన్‌లో మరింత కసి, పట్టుదలతో రాణిస్తాం. చెన్నైతో మ్యాచ్‌లో పవర్‌ప్లే ఓవర్లు పూర్తయ్యే లోపే రెండు కీలక వికెట్లు చేజార్చుకున్నాం. అలాగనీ పిచ్‌పై ఫిర్యాదు చేయదల్చుకోలేదు. సొంతమైదానం ఢిల్లీలోనూ మేము అనూ హ్య ఓటములు ఎదుర్కొన్నాను. అయి నా ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోకుం డా ముంబై, చెన్నైతో సమానంగా 18 పాయింట్లు దక్కించుకున్నాం. ఈ మా ప్రయాణంలో కోచ్ పాంటింగ్ సేవలు ఎనలేనివి అని అయ్యర్ అన్నాడు.

179

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles