ఛెత్రికి మా దేశ పాస్‌పోర్ట్ ఇస్తాం


Tue,November 14, 2017 01:58 AM

sunil
మార్గవో: భారత స్టార్ ైస్ట్రెకర్ సునీల్ ఛెత్రి ఆటకు మయన్మార్ కోచ్ గెర్డ్ జేస్ ఫిదా అయిపోయాడు. 2019 ఏఎఫ్‌సీ ఆసి యా కప్ అర్హత టోర్నీ తొలి అంచె మ్యాచ్‌లో ఛెత్రి కొట్టిన గోల్ రెండు జట్ల మధ్య అంతరాన్ని చూపిందని గెర్డ్ అన్నాడు. అవకాశముంటే మా దేశ పాస్‌పోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కోచ్ పేర్కొన్నాడు. భారత కెప్టెన్ చాలా కూల్‌గా ఉంటాడు, అంతేకాదు అతను చాలా ప్రమాదకరమైన ఆటగాడు. ప్రతిదాడులతో పాటు డిఫెన్స్‌లో అతన్ని నిలువరించకపోతే కష్టం అని గెర్డ్ అన్నాడు. ఇరు జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ జరుగనుంది.

315

More News

VIRAL NEWS