విరాట్ ఫామ్‌పై ఆందోళన వద్దు: హాగ్


Sat,April 13, 2019 02:09 AM

hogg
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో బెంగళూరు జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతున్నా.. రాబోయే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఆటపై ఇది ఎలాంటి ప్రభావం చూపదని ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అన్నాడు. టీమ్‌ఇండియా తరఫున కోహ్లీ భిన్నమైన ప్రదర్శన చేస్తాడని కితాబిచ్చాడు. ప్రస్తుత ఫామ్ విరాట్ ప్రపంచకప్ ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశమే లేదు. వ్యక్తిగతంగా అతనిలో మరో ఆటగాడు ఉన్నాడు. మేజర్ టోర్నీల్లో ఇది బహిర్గతమవుతుంది. ముఖ్యంగా వరల్డ్‌కప్‌లాంటి ఈవెంట్లలో విరాట్ అనూహ్యంగా చెలరేగుతాడు. కచ్చితంగా విజయవంతమవుతాడు. ఇందు లో ఎలాంటి సందేహం లేదు అని హాగ్ పేర్కొన్నాడు. కోహ్లీ, డివిలియర్స్‌పై ఎక్కువగా ఆధారపడటం వల్ల ఆర్‌సీబీ విజయవంతకాలేకపోతుందన్నాడు. వీళ్లిద్దర్ని పట్టించుకోకుం డా మిడిలార్డర్ రాణిస్తే కచ్చితంగా గాడిలో పడుతుందన్నాడు. డెత్ ఓవర్లలో బౌలర్లు కూ డా మరింత రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. అనుకున్న ప్రణాళికలను సమర్థంగా అమలు చేయడం లేదన్న హాగ్.. వీలైనంత త్వరగా మేనేజ్‌మెంట్ పరిస్థితులను సమీక్షించాలని సూచించాడు. జట్టులో మా ర్పులు చేస్తూ విజయాలబాట పట్టించాలన్నాడు.

386

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles