యో యో పరీక్షలో అశ్విన్ పాస్


Thu,October 12, 2017 12:16 AM

చెన్నై: భారత క్రికెటర్ల ఫిట్‌నెస్‌కు కఠిన పరీక్షగా మారిన యో యో టెస్టును ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ పాసయ్యాడు. బెంగళూరులోని జాతీయ అకాడమీలో జరిగిన ఈ పరీక్షలో బీసీసీఐ నిర్దేశించిన మార్క్(16.1పాయింట్లు సాధించడం)ను స్పిన్న ర్ సాధించాడు. ఈమేరకు యో యో పరీక్ష పాస్ అయ్యానని అశ్విన్ ట్వీట్ చేశాడు. భారత్‌కు ఆడాలంటే ఈపరీక్ష పాసవ్వాలని నిబంధన పెట్టడంతో ఇప్పుడు క్రికెటర్లంతా యో యో బాట ప డుతున్నారు. శ్రీలంక, ఆసీస్‌తో సిరీస్‌కు విశ్రాం తినివ్వడంతో అశ్విన్ ఇంగ్లండ్ కౌంటీల్లో బరిలోకి దిగాడు. అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు తమిళనాడు తరఫున రంజీ మ్యాచ్‌లో ఆడాడు.

353

More News

VIRAL NEWS

Featured Articles