శాస్త్రి జీతం ఏడున్నర కోట్లు!


Mon,July 17, 2017 02:02 AM

న్యూఢిల్లీ: భారత జట్టు చీఫ్ కోచ్‌గా ఎంపిక రవిశాస్త్రి వార్షిక వేతనం కింద ఏడున్నర కోట్లు అందుకోనున్నాడు. ఇంత మొత్తాన్ని చెల్లించేందుకు బీసీసీఐ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. గతంలో కోచ్‌ల జీతాలపై కుంబ్లే బోర్డుకు ఓ నివేదికను సమర్పించాడు. అందులో చీఫ్ కోచ్‌గా పని చేసే వ్యక్తికి 6కోట్లు చెల్లించాల్సిందేనని ఖరాఖండిగా చెప్పాడు. దాని ఫలితంగానే ఇప్పుడు శాస్త్రి ఇంత పెద్ద మొత్తం లో వేతనాన్ని అందుకోబోతున్నాడు. గతంలో టీమ్ డైరెక్టర్‌గా కూడా శాస్త్రి 7 నుంచి 7.5 కోట్ల దాకా అందుకున్నాడు.

ఇక బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లకు మాత్రం ఏడాదికి చెరో రూ. 2 కోట్లు చెల్లించేందుకు బోర్డు సిద్ధంగా ఉంది. ఐపీఎల్ పంజాబ్ జట్టు చీఫ్ కోచ్ పదవిని వదిలేస్తున్న బంగర్‌కు కాస్త ఎక్కువగా ఇవ్వాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉంది. అండర్-19, ఏ జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్న ద్రవిడ్‌కు తొలి ఏడాది రూ. 4.5 కోట్లు, రెండో ఏడాది రూ. 5 కోట్లు పారితోషికంగా చెల్లించనున్నారు. ఒకవేళ సీనియర్ జట్టుకు బ్యాటింగ్ సలహాదారుడిగా పనిచేస్తే అదనంగా డబ్బులు ఇచ్చే అవకాశాలున్నాయి.

అరుణ్‌కు లైన్ క్లియర్: బౌలిగ్ కోచ్‌గా భరత్ అరుణ్ ఎంపికలో శాస్త్రి పంతం నెగ్గుతున్నట్లే కనిపిస్తున్నది. అతని ఎంపికకు సీవోఏ కూడా దాదాపుగా ఓకే చెప్పినట్లు సమాచారం. సోమవారం రవిశాస్త్రి.. కమిటీతో భేటీ కాబోతున్నాడు. అక్కడే అన్ని విషయాలను చర్చించి గ్రీన్‌సిగ్నల్ తీసుకోవాలని భావిస్తున్నాడు. జహీర్‌లాగా కొన్నిరోజులే కాకుండా పూర్తిస్థాయిలో జట్టుకు అందుబాటులో ఉండటం భరత్‌కు కలిసొచ్చే అంశం. కమిటీ ముందు కూడా ఇదే విషయాన్ని చీఫ్ కోచ్ ఎక్కువగా ప్రస్తావించే అవకాశాలున్నాయి.

315

More News

VIRAL NEWS