ఆఫ్ఘన్ కెప్టెన్‌గా రషీద్ ఖాన్


Sat,July 13, 2019 02:42 AM

Rashid-Khan
కాబూల్: ప్రపంచకప్‌లో నిరాశజనక ప్రదర్శన చేసి.. ఆడి న ఆన్ని మ్యాచ్‌ల్లో నూ ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన ఆఫ్ఘనిస్థాన్.. తప్పులు సరిదిద్దుకునే పనిలో పడింది. ఇప్పటికే బోర్డు వర్గా లు, కోచ్ మధ్య వివాదాలు.. విశ్వసమరానికి ముందు కెప్టెన్ మార్పుతో వార్తల్లోకెక్కిన ఆఫ్ఘన్ క్రికెట్ తాజాగా.. స్టార్ స్పిన్నర్ రషీద్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది. అన్ని ఫార్మాట్‌లకు ఈ ఆఫ్‌స్పిన్నర్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ శుక్రవారం ప్రకటన విడుదల చేసిం ది. సీనియర్ బ్యాట్స్‌మన్ అస్గర్ అఫ్ఘన్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ప్రపంచకప్‌నకు ముందు మూడు ఫార్మాట్‌లకు ముగ్గురు కెప్టెన్‌లను (టెస్టులకు రహ్మత్ షా, వన్డేలకు గుల్బదీన్ నైబ్, టీ20లకు రషీద్ ఖాన్) ఎంపిక చేసిన ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) తాజాగా అన్నీ ఫార్మాట్‌లకు రషీద్‌ను సారథిగా నియమించింది.

472

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles