ఆధిక్యంలో గుజరాత్

Thu,January 12, 2017 01:36 AM

ఇండోర్: రంజీ ఫైనల్ రంజుగా సాగుతున్నది. 66 ఏండ్ల తర్వాత తొలిసారి టైటిల్ పోరుకు అర్హత సాధించిన గుజరాత్..డిఫెండింగ్ చాంపియన్ ముంబైకి దీటుగా రాణిస్తున్నది. 2/0 ఓవర్‌నైట్ స్కోరుతో రెండోరోజైన బుధవారం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన గుజరాత్ ఆట ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది. చేతిలో ఇంకా నాలుగు వికెట్లు ఉన్న గుజరాత్ ప్రస్తుతం 63 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది. 27 పరుగులకే ఓపెనర్లు సమిత్ గోహెల్(4), ప్రియాంక్ పంచల్(6) నిష్క్రమణతో గుజరాత్ కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో కెప్టెన్ పార్థివ్ పటేల్ (146 బంతుల్లో 90), మన్‌ప్రీత్ జునేజా(77) ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 120 పరుగుల కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పారు. ముఖ్యంగా పార్థివ్ సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మైదానం నలువైపులా చూడచక్కని షాట్లతో అలరించిన పటేల్ పది పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. చిరాగ్(17), కలేరియా(16) క్రీజులో ఉన్నారు.

235

More News