రాణి నాయకత్వంలో భారత్


Sat,May 11, 2019 05:14 AM

womenhokeyteam
న్యూఢిల్లీ: కొరియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్ లో భారత మహిళల హాకీ జట్టుకు ైస్ట్రెకర్ రాణి రాంపాల్ నాయకత్వం వహించనుంది. ఈనెల 20న మొదలయ్యే సిరీస్ కోసం హాకీ ఇండియా(హెచ్‌ఐ) శుక్రవారం 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గోల్‌కీపర్ సవిత.. రాణి రాంపాల్ డిప్యూటీగా వ్యవహరించనుంది. జపాన్ వేదికగా జూన్‌లో జరిగే ఎఫ్‌ఐహెచ్ మహిళల సిరీస్ ఫైనల్స్‌కు కొరియాతో సిరీస్ ఉపయోగపడనుంది. గాయం కారణంగా మలేసియా పర్యటనకు దూరమైన డిఫెండర్ గుర్జిత్‌కౌర్ తిరిగి జట్టులోకి వచ్చింది. సవితతో పాటు తెలుగమ్మాయి ఇతిమరుపు రజనీ గోల్‌కీపర్ బాధ్యతలు నిర్వర్తించనుంది. వందనా కటారియా, లాల్‌రెమిసియామి, జ్యోతి, నవ్‌నీత్‌కౌర్‌తో కూడిన ఫార్వర్డ్ దళాన్ని రాణి నడిపించనుంది. మోనికా, నవ్‌జ్యోత్‌కౌర్, నిక్కీ ప్రధాన్, నేహా గోయల్, లిలిమామింజ్‌తో డిఫెన్స్ పటిష్ఠంగా కనిపిస్తున్నది. రాణి, గుర్జీత్‌కౌర్ చేరికతో జట్టు బలంగా మారిందని జట్టు చీఫ్ కోచ్ జోయర్డ్ మారిజన్ అన్నాడు.

జట్టు వివరాలు: రాణి రాంపాల్(కెప్టెన్), సలీమా, సునీత లక్రా, దీప్‌గ్రేస్ ఎక్కా, కరిష్మా యాదవ్, గుర్జిత్ కౌర్, సుశీలా చాను, మోనికా, నవ్‌జ్యోత్‌కౌర్, నిక్కీ ప్రధాన్, నేహా గోయల్, లిలిమా మింజ్, వందన కటారియా, లాల్‌రెమిసియామి, జ్యోతి, నవ్‌నీత్‌కౌర్, సవిత, రజనీ.

204

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles