రామ్‌కుమార్ కెరీర్ బెస్ట్


Tue,July 18, 2017 12:39 AM

Ramkumar
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ సింగిల్స్ ఆశాకిరణం రామ్‌కుమార్ రామనాథన్ కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకున్నాడు. తాజాగా ప్రకటించిన ఏటీపీ ర్యాంకింగ్స్‌లో చెన్నై కుర్రాడు రామ్‌కుమార్ ఏకంగా 16స్థానాలు ఎగబాకి 168వ ర్యాంకులో నిలిచాడు. రామ్ కెరీర్‌లో ఇదే బెస్ట్ ర్యాంక్. దీంతో 22ఏండ్ల రామ్‌కుమార్ భారత్ నుంచి సింగిల్స్‌లో అత్యుత్తమ ర్యాంకర్‌గా కొనసాగుతున్నాడు. ఇటీవల అమెరికాలో జరిగిన విన్నెట్కా చాలెంజర్‌లో రన్నరప్‌గా నిలువడంతో రామ్‌కుమార్ ర్యాంక్ మెరుగైంది. యుకీ భాంబ్రీ 212, ప్రజనీష్ గుణేశ్వరన్ 214, శ్రీరామ్ బాలాజీ 293, సుమిత్ నాగల్ 306వ ర్యాంకుల్లో ఉన్నారు. డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న ఓ స్థానం కోల్పోయి 22వ ర్యాంకులో నిలిచాడు. దివిజ్ శరణ్ ఆరు స్థానాలు ఎగబాకి 51వ, పురవ్ రాజా ఐదుస్థానాలు మెరుగుపరుచుకొని 52వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. వెటరన్ లియాండర్ పేస్ మూడుస్థానాలు ఎగబాకి 59వ ర్యాంక్‌కు చేరుకోగా, జీవన్ 98వ ర్యాంక్‌కు పడిపోయాడు. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా 7వ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది.

172

More News

VIRAL NEWS