తొలి రోజు వర్షార్పణం


Fri,August 10, 2018 12:33 AM

భారత్, ఇంగ్లండ్ రెండో టెస్టు
lords-pitch
లండన్: భారీ వర్షం కారణంగా భారత్, ఇంగ్లండ్ మధ్య గురువారం మొదలైన రెండో టెస్టు తొలి రోజు ఆట రద్దయ్యింది. ఎడతెరిపి లేకుండా వాన కురువడంతో ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దీంతో ఒక్క బంతి కూడా సాధ్యపడలేదు. ఉదయం నుంచి చినుకులు పడటంతో టాస్ కూడా వేయలేదు. ఎంతకూ వాన తగ్గకపోవడంతో షెడ్యూల్ సమయం కంటే 30 నిమిషాల ముందు ఇరుజట్లు లంచ్‌కు వెళ్లాయి. కానీ బ్రేక్ తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొనడంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యారు. ఓవరాల్‌గా రెండు సెషన్ల ఆట తుడిచి పెట్టుకుపోయింది. టీ విరామం తర్వాత 45 నిమిషాలకు కొద్దిగా తెరిపినివ్వడంతో మైదానం సిబ్బందిని రంగంలోకి దిగారు. కానీ అప్పటికే రెండుసార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు ఔట్ ఫీల్డ్ బాగాలేదని తొలి రోజు ఆటను రద్దు చేశారు. మిగతా నాలుగు రోజులు 96 ఓవర్లపాటు ఆటను కొనసాగించనున్నారు. కానీ ఈ వారాంతం మొత్తం లార్డ్స్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదిక. మ్యాచ్ జరిగే అవకాశాల్లేకపోవడంతో కోహ్లీ, కార్తీక్, ఠాకూర్, బుమ్రా, కుక్, జెన్నింగ్స్ ఇండోర్ నెట్స్‌లో సాధన చేశారు. ఒలివర్ పోప్ ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేస్తుండగా, టీమ్‌ఇండియా తుది జట్టును ప్రకటించలేదు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 0-1తో వెనుకబడ్డ విరాట్‌సేన ఈ మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే కుల్దీప్, జడేజాలలో ఒకరికి అవకాశం దక్కొచ్చు.

471

More News

VIRAL NEWS