భారత్, పాక్ మ్యాచ్ రద్దయితే భారీ నష్టం


Sun,June 16, 2019 03:27 AM

manchester
న్యూఢిల్లీ: ప్రపంచకప్ జరుగుతున్న ఇంగ్లండ్‌లో అకాల వర్షాలతో ఆటగాళ్లు, అభిమానులే కాదు.. ప్రసారదారులు, స్పాన్సర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెగాటోర్నీలో వర్షం కారణంగా నాలుగు మ్యాచ్‌లు రద్దుకావడంతో ప్రధాన ప్రసారదారు స్టార్‌స్పోర్ట్స్ చానల్ దాదాపు రూ. 180 కోట్ల మేర నష్టపోయినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు కలిగిన నష్టంకన్నా.. ఆదివారం జరుగనున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ వర్షార్పణమైతే ఎదుర్కోవాల్సిన భారం ఇంకా ఎక్కువగా ఉండనుంది. దాయాదుల మ్యాచ్‌కు వరణుడు అడ్డుపడితే.. స్టార్ స్పోర్ట్స్ సుమారు రూ. 137.5 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోనుంది. దీని ప్రభావం ప్రధాన స్పాన్సైర్లెన కోకాకోలా, ఉబర్, వన్‌ప్లస్, ఎమ్‌ఆర్‌ఎఫ్ వంటి కంపెనీలపైనా పడనుంది.

సెకనుకు రూ.2.5 లక్షలు సాధారణంగా ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో స్టార్ స్పోర్ట్స్ చానల్ ఒక్క సెకన్ అడ్వైర్టెజ్‌మెంట్‌కు రూ. 1.6 నుంచి 1.8 లక్షల వరకు వసూలు చేస్తుంది. కానీ భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు మాత్రం ఆ ధర రూ.2.5 లక్షల పైనే ఉండనుంది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు కోట్లాది మంది క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోనుండటంతో దాన్ని సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో స్టార్ స్పోర్ట్స్ ఈ ధర పెంచింది. ఇదంతా అధికారిక లెక్కే.. ఇక అనధికారికంగా చేతులు మారే బెట్టింగ్ మనీ ఇందుకు వందల రెట్లు ఉంటుందనడంలో సందేహం లేదు. అందుకే అంతా ముక్తకంఠంతో వరుణదేవా.. కరుణించవా అని వేడుకుంటున్నారు.

2513

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles