మ్యాచ్ వర్షార్పణం


Tue,June 11, 2019 01:27 AM

-దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌కు చెరో పాయింట్
సౌతాంప్టన్: ప్రపంచకప్‌ను వరుణుడు నీడలా వెంటాడుతూనే ఉన్నాడు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు దాదాపు ప్రతి మ్యాచ్‌ను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఎడతెరిపిలేని వర్షంతో సోమవారం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య మ్యాచ్ పూర్తిగా రద్దయ్యింది. విరామం లేని వర్షంతో మైదానం మొత్తం చిత్తడిగా మారడంతో పలుమార్లు పరిశీలించిన అంపైర్లు ఆటకు అనుకూలంగా లేదని తేల్చి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. మెగాటోర్నీలో పాయింట్ల ఖాతా తెరిచిన దక్షిణాఫ్రికా 9వ స్థానంలో ఉంటే..మూడు పాయింట్లతో విండీస్ ఐదుకు చేరింది. అంతకుముందు టాస్ చేజార్చుకుని బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు..కాట్రెల్(2/18) ధాటికి 7.3 ఓవర్లలో 2 వికెట్లకు 29 పరుగులు చేశారు. ఆమ్లా(6), మార్క్మ్(్ర5) నిరాశపరిచారు. తమ తదుపరి మ్యాచ్‌లో సఫారీలు ఆఫ్ఘన్‌తో, విండీస్.. ఇంగ్లండ్‌తో తలపడుతాయి.
Match

340

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles