ద్రవిడ్, జహీర్‌లను అవమానిస్తారా?

Mon,July 17, 2017 02:07 AM

guha
ముంబై: మాజీ కోచ్ అనిల్ కుంబ్లే మాదిరిగానే.. ద్రవిడ్, జహీర్‌లను బీసీసీఐ ఘోరంగా అవమానిస్తున్నదని సీవోఏ మాజీ సభ్యుడు రామచంద్ర గుహ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సహాయక కోచ్‌లుగా వాళ్ల పేర్లను బయటకు తీసుకొచ్చి ఇప్పుడు యూ టర్న్ తీసుకోవడమేంటని విమర్శించాడు. కుంబ్లే, ద్రవిడ్, జహీర్‌లు నిజమైన క్రికెట్ దిగ్గజాలు. మైదానంలో వాళ్లు ఎన్నో అద్భుతాలు చేశారు. అలాంటి వారిని బీసీసీఐ అవమానపరుస్తున్నది అంటూ గుహ ట్వీట్ చేశాడు. జట్టులో నెలకొన్న సూపర్‌స్టార్ సంస్కృతికి ఇదో నిదర్శనమని దుయ్యబట్టాడు.

480

More News