సింధు పోరాడినా..


Wed,May 22, 2019 02:59 AM

సుదిర్మన్‌లో భారత్‌కు దక్కని బోణీ
Sindhu
నానింగ్: ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న సుదిర్మన్ కప్‌లో ఈసారైనా టైటిల్ ఆశలు నెరవేర్చుకోవాలనుకున్న భారత జట్టుకు సరైన శుభారంభం దక్కలేదు. తమ తొలి పోరులో భాగంగా మంగళవారం మలేషియాతో పోటీకి దిగిన భారత్ 2-3తో ఓటమిపాలైంది. దీంతో నాకౌట్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. తొలుత జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ పోరులో భారత ద్వయం సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, అశ్విని పొనప్ప 16-21, 21-17, 24-22తో మలేషియా జోడీ గో సన్ హువాత్, లై షివాన్ జెమీపై విజయం సాధించడంతో టీమ్‌ఇండియా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే పురుషుల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌ను కాదని..ప్రపంచ 13వ ర్యాంకర్ సమీర్‌వర్మను బరిలోకి దింపటం బెడిసికొట్టింది.

సమీర్ 13-21, 15-21తో లీ జీ జియా చేతిలో ఓడటంతో స్కోరు 1-1తో సమమైంది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 21-12, 21-18తో గోహ్ జిన్ వీపై అలవోక విజయం సాధించడంతో ఆధిక్యం 2-1లోకి వెళ్లింది. అయితే పురుషుల డబుల్స్‌లో భారత జోడీ మను అత్రి, సుమిత్ రెడ్డి 20-22, 19-21తో ఆరోన్ చియా, తైయి యి చేతిలో ఓడటంతో స్కోరు 2-2తో సమైమైంది. ఆఖరిదైన మహిళల డబుల్స్‌లో అశ్విని పొనప్ప, సిక్కీరెడ్డి జోడీ 11-21, 19-21తో చో మియి కున్, లీ మెంగ్ యిన్‌పై ఓడటంతో 2-3తో భారత్ ఓటమి ఖరారైంది. తమ రెండో పోరులో బుధవారం డిఫెండింగ్ చాంపియన్ చైనాతో భారత్ తలపడుతుంది.

272

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles