సింధు X సైనా


Sun,August 11, 2019 01:57 AM

Sindhu

-ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ముఖాముఖి తలపడే చాన్స్

న్యూఢిల్లీ: బాసెల్(స్విట్జర్లాండ్) వేదికగా వచ్చే వారంలో జరుగనున్న ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు ముఖాముఖి తలపడనున్నారు. మహిళల సింగిల్స్ డ్రాలో ప్రపంచ గవర్నింగ్ బాడీ మార్పులు చేసింది. దీంతో ఒకే పార్శంలో ఉన్న సైనా, సింధు సెమీఫైనల్లో తలపడే అవకాశాలు ఉన్నాయి. మహిళల సింగిల్స్ తప్ప మిగతా నాలుగు విభాగాల్లో ఎలాంటి మార్పు చేయలేదని బీడబ్ల్యూఎఫ్ శనివారం పేర్కొంది. మహిళల సింగిల్స్‌లో మారిషస్‌కు చెందిన కేట్ కునె పేరు తప్పిదంగా వచ్చింది. ఈ కారణంగా బీడబ్ల్యూఎఫ్ మార్పులు చేసి డ్రాను పునరుద్ధరించాల్సి వచ్చింది అని ఫెడరేషన్ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఐదో సీడ్‌గా బరిలోకి దిగుతున్న సింధుకు తొలి రౌండ్‌లో బై లభించింది. పై యు పో లేదా లిండా జెచిరితో సింధు రెండో రౌండ్‌లో ఆడుతుంది. మరోవైపు ఎనిమిదో సీడ్ సైనా.. సబ్రినా జాక్వెట్, సొరయా డీ విచ్ మధ్య విజేతతో తలపడుతుంది. ఇలా గ్రూపు దశను దాటుకుని వస్తే సైనా, సింధు సెమీస్‌లో ఆడాల్సి వస్తుంది.

340

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles