సింధు శుభారంభం


Wed,October 23, 2019 03:10 AM

SINDHU
పారిస్ : భారత స్టార్ షట్లర్ వీపీ సింధు.. ఫ్రెంచ్ ఓపెన్‌లో శుభారంభం చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ చాంపియన్ సింధు 21-15, 21-13తేడాతో మిషెల్లీ లీ(కెనడా)పై సునాయాస విజయం సాధించింది. 44 నిమిషాల పాటు మ్యాచ్ జరుగగా.. తొలి గేమ్‌లో ఓ దశలో 2-5తో వెనుకబడ్డ భారత ప్లేయర్ ఆ తర్వాత పుంజుకుంది. 8-8తో పాయింట్లు సమమయ్యాక వెనక్కి తిరిగిచూసుకోలేదు.

ఓ దశలో వరుసగా ఐదు పాయింట్లు సాధించడం సహా 21-15తో గేమ్‌ను తెలుగమ్మాయి సొంతం చేసుకుంది. రెండో గేమ్ సైతం హోరాహోరీగా సాగగా.. సింధు 8-10తో వెనుకబడింది. ఆ తరుణంలో దూకుడు ప్రదర్శించిన సింధు వరుసగా ఏడు పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత కూడా జోరును కొనసాగించి ప్రత్యర్థిని అలవోకగా ఓడించింది. రెండో రౌండ్‌లో 26వ ర్యాంకర్ యే జియామిన్(సింగపూర్)తో సింధు తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు శుభంకర్ డే సైతం మంచి ఆరంభాన్ని అందుకున్నాడు. తొలి రౌండ్‌లో శుభంకర్ 15-21, 21-14, 21-17తో టామీ సుగియాత్రో(ఇండోనేషియా)పై గంటా 18నిమిషాల పాటు పోరాడి మూడు గేమ్‌ల్లో విజయం సాధించాడు.

భారత్ కీ లక్ష్మీ అంబాసిడర్లుగా సింధు, దీపిక

మహిళా సాధికారతను, కృషిని చాటే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న భారత్ కీ లక్ష్మీ కార్యక్రమానికి బ్రాండ్ అంబాపిడర్లుగా పీవీ సింధు, దీపికా పదుకోన్ ఎంపికయ్యారు. మహిళా సాధికారతను ప్రస్ఫుటిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన ఓ వీడియోను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారత నారీశక్తి, పట్టుదల, ధృడ సంకల్పం, అంకితభావాన్ని తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మహిళా సాధికారతకు మద్దతుగా నిలిచేందుకు ఎల్లప్పుడు ముందుంటామని చెప్పదల్చుకున్నాం అని మోదీ అన్నారు. ఈ వీడియోకు మద్దతుగా నిలుస్తూ సింధు, దీపిక తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

298

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles