గోపీచంద్ అకాడమీ కొత్త టాలెంట్ హంట్


Thu,December 7, 2017 03:12 AM

gopichand
ముంబై: యంగ్ చాంప్స్ క్యాంపైన్ పేరుతో ఐడీబీఐ ఫెడరల్ ఇన్యూరెన్స్ కంపెనీతో కలిసి గోపీచంద్ అకాడమీ కొత్త టాలెంట్ హంట్ కార్యక్రమం చేపట్టనుంది. అండర్-10 విభాగంలో సుమారు 10 నుంచి 15 మంది పిల్లలను గుర్తించి వారికి హైదరాబాద్ నగరంలోని గోపీచంద్ అకాడమీలో శిక్షణ కల్పిస్తామని బుధవారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ మాజీ ముంబై పేసర్, జీవితభీమా కంపెనీ సీఈవో విగ్నేశ్ సహాన్నే తెలిపాడు. మేం ఈ టాలెంట్‌హంట్‌ను వ్యాపారదృష్టితో చూడడం లేదు. కేవలం బ్యాడ్మింటన్‌పై మక్కువతోనే ఈ కార్యక్రమం చేపట్టాం. నేటి నుంచి అండర్ -10 విభాగంలోని పిల్లలు వారి బ్యాడ్మింటన్ సామర్థ్యాలను అకాడమీకి సంబంధించిన ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలలో రెండునిమిషాల వీడియోలను అప్‌లోడ్ చేస్తారు. ఈ ప్రక్రియ ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. ఈ పోటీలో విజయం సాధించిన విజేతలకు సెలక్షన్ ప్రాతిపదికన గోపీచంద్ అకాడమీకి పంపుతాం అని అన్నాడు.

492

More News

VIRAL NEWS