పుజార ఐదు రోజుల బ్యాటింగ్


Tue,November 21, 2017 02:21 AM

Pujara
భారత స్టార్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజార అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టెస్ట్‌ల్లో ఐదు రోజులు బ్యాటింగ్ చేసిన మూడో భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో హైదరాబాదీ మాజీ క్రికెటర్ ఎమ్‌ఎల్ జయసింహ(1960), ప్రస్తుత చీఫ్ కోచ్ రవిశాస్త్రి(1984)ఈ ఘనత సాధించారు. ఈ ముగ్గురు కూడా ఈడెన్‌గార్డెన్స్‌లోనే ఫీట్ నెలకొల్పడం విశేషం. ఓవరాల్‌గా ఈ జాబితాలో జెఫ్రీ బాయ్‌కాట్(ఇంగ్లండ్), కిమ్ హ్యూస్(ఆస్ట్రేలియా), అలెన్ లాంబ్(ఇంగ్లండ్), అడ్రియన్ గ్రిఫిత్(వెస్టిండీస్), ఫ్లింటాఫ్(ఇంగ్లండ్), పీటర్సన్(దక్షిణాఫ్రికా) ఉన్నారు.

305

More News

VIRAL NEWS