టైటాన్స్‌పరాజయాల హ్యాట్రిక్‌


Tue,October 8, 2019 03:17 AM

Pro-Kabaddi
- గుజరాత్‌ చేతిలో ఓటమి

గ్రేటర్‌ నోయిడా: తొలి అర్ధభాగం వరకు ఎదురులేని ఆధిపత్యం ప్రదర్శించి.. ఆ తర్వాత చతికిలబడిన తెలుగు టైటాన్స్‌ ప్రొకబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో మరో పరాజయాల హ్యాట్రిక్‌ను నమోదు చేసింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 38-48తేడాతో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌పై పరాజయం పాలైంది. రైడర్లు సిద్ధార్థ్‌ దేశాయ్‌ (13 పాయింట్లు), రాకేశ్‌ గౌడ (6 పాయింట్లు) రాణించినా ఫలితం లేక పోయింది. గుజరాత్‌ జట్టులో రైడర్‌ సోనూ (17 పాయింట్లు), డిఫెండర్‌ పంకజ్‌ (5పాయింట్లు) అదరగొట్టారు. మ్యాచ్‌ తొలి నుంచి తెలుగు టైటాన్స్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఏడో నిమిషంలోనే గుజరాత్‌ను ఆలౌట్‌ చేసి 12-5తో టైటాన్స్‌ పైచేయి సాధించింది. ఫస్ట్‌హాఫ్‌ ముగిసే సరికి 21-13తో నిలి చింది. అయితే రెండో అర్ధభాగంలో కథ అడ్డం తిరిగింది. గుజరాత్‌ రైడర్‌ సోనూ రెచ్చిపోయి వరుస పాయింట్లు సాధించాడు. దీంతో ద్వితీయార్ధం రెండో నిమిషంలోనే టైటాన్స్‌ ఆలౌట్‌ కాగా, ఆధిక్యం 22-19కి తగ్గిపోయింది. 32వ నిమిషంలో మరోసారి ఆలౌటైన తెలుగు జట్టు 30-32తో వెనుకబడింది. చివరికి టైటాన్స్‌కు పరాజయం తప్పలేదు. మరోమ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌ 35-33తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై విజయం సాధించింది.

492

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles