ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు ఖరారు


Sun,October 6, 2019 01:59 AM

Pro-Kabaddi
- ఢిల్లీపై గెలుపుతో నాకౌట్‌కు యూపీ యోధా
గ్రేటర్‌ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఇప్పటికే ఐదు జట్లు నాకౌట్‌లో అడుగుపెట్టగా.. శనివారం సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లోనే జయభేరి మోగించిన యూపీ యోధా కూడా ఆ జాబితాలో చేరింది. ఇక తేలాల్సిందల్లా పాయింట్ల పట్టికలో ఎవరు అగ్రస్థానంలో నిలుస్తారనేదే. తాజా మ్యాచ్‌లో యూపీ 50-33తో టేబుల్‌ టాపర్‌ దబంగ్‌ ఢిల్లీపై విజయం సాధించింది. యూపీ తరఫున మోనూ గోయత్‌ (11 పాయింట్లు), శ్రీకాంత్‌ (9 పాయింట్లు) రాణించగా.. ఢిల్లీ తరఫున నీరజ్‌ (11 పాయింట్లు), సోమ్‌బీర్‌ (9 పాయింట్లు) ఆకట్టుకున్నారు. వీరితో పాటు మిరాజ్‌ (7 పాయింట్లు) మినహా మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. మరో మ్యాచ్‌లో పాట్నా పైరెట్స్‌ 39-33తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌పై గెలిచింది.

655

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles