ఐపీఎల్‌వరకు ఫిట్‌నెస్ సాధిస్తా


Tue,January 22, 2019 01:05 AM

Prithvi-Shaw
న్యూఢిల్లీ: కాలి మడమ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నట్లు టీమ్ ఇండియా యువ ఓపెనర్ పృథ్వీ షా తెలిపాడు. ఐపీఎల్ ప్రారంభానికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తానని, అందుకోసం ఎంతో కష్టపడుతున్నట్లు సోమవారం మీడియాకు తెలిపాడు. కాలి మడమ పూర్తిగా 90 డిగ్రీల కోణంలో తిరగబడడం నాకు చాలా నొప్పిని కలిగించింది. కాలి పైభాగం, మడమ పటిష్ఠంగా మారేలా ప్రత్యేకంగా ఎక్సర్‌సైజ్ చేస్తున్నాను. సిడ్నీలో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా బంతిని అందుకునేందుకు గాల్లోకి ఎగిరాను. కిందికి వాలే సమయంలో నా కాలి మడమ పూర్తిగా తిరగబడిన సమయంలో అదే కాలుపై నా శరీరబరువంతా వాలింది. రెండో టెస్ ఆడేందుకు నన్ను సిద్ధం చేయాలని జట్టు ఫిజియోలు ప్రయత్నించారు. ఆ సమయంలో నా కాలిమడమ మరింతగా వాచి నొప్పిని పెంచింది. దీంతో భారత్ తిరిగి వచ్చి గాయానికి చికిత్స తీసుకున్నాను. ఆస్ట్రేలియాలోని బౌన్స్‌ను ఎంతో ఇష్టపడే నేను అక్కడి టెస్ట్ సిరీస్ ఆడకపోవడం నిరాశను కలిగించింది. కాగా, టీమ్ ఇండియా విజయం ఎంతో సంతోషాన్నిచ్చింది అని పృథ్వీ షా అన్నాడు

628

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles