ప్రపంచ రెజ్లింగ్‌కు భజరంగ్


Sun,August 13, 2017 12:27 AM

పారిస్: ఆసియా చాంపియన్ భజరంగ్ పూనియా ఈనెల 21నుంచి పారిస్ (ఫ్రాన్స్) వేదికగా జరిగే ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఫ్రీస్టయిల్ కేటగిరీ 65కిలోల విభాగంలో భజరంగ్ పోటీపడనున్నాడు. శనివారం ఇక్కడ ప్రత్యేకంగా జరిగిన సెలెక్షన్ ట్రయల్స్‌లో రాహుల్‌ను 10-0తో ఓడించి భజరంగ్ జట్టుకు ఎంపికయ్యాడు. గతనెల సోనేపట్‌లో జరిగిన 65కిలోల సెలెక్షన్స్‌లో రాహుల్ విజేతగా నిలిచి ఫైనల్ ట్రయల్స్‌కు ఎంపికయ్యాడు. అయితే, ఆ తర్వాత వైరల్ ఫీవర్ కారణంగా భజరంగ్ ఫైనల్ ట్రయల్స్‌కు హాజరుకాలేకపోయాడు. దీంతో తాను కోలుకున్న తర్వాత ఫైనల్ ట్రయల్స్ నిర్వహించాల్సిందిగా భజరంగ్ అప్పట్లోనే రెజ్లింగ్ సమాఖ్యకు దరఖాస్తు చేసుకున్నాడు. తాజాగా నిర్వహించిన ఫైనల్ ట్రయల్స్‌లో రాహుల్‌పై గెలిచి భజరంగ్ ప్రపంచ బెర్త్ ఖరారు చేసుకున్నాడు.

168

More News

VIRAL NEWS

Featured Articles