రెండో టెస్ట్‌కు ఫిలాండర్ దూరం


Wed,February 20, 2019 01:15 AM

Vernon-Philander
పోర్ట్ ఎలిజబెత్: కాలిపిక్క గాయంతో దక్షిణాఫ్రికా పేసర్ వెర్నాండ్ ఫిలాండర్.. శ్రీలంకతో రెండో టెస్ట్‌కు దూరమయ్యాడు. గురువారం నుంచి సెయింట్ జార్జ్ పార్క్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది. డర్బన్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో గాయపడ్డ ఫిలాండర్.. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేదు. ప్రస్తుతం నొప్పితో బాధపడుతున్న అతను 10 నుంచి 12 రోజులు ఆటకు దూరంగా ఉండనున్నాడని సఫారీ జట్టు కోచ్ ఒటిస్ గిబ్బన్ తెలిపాడు. రెండో టెస్ట్‌కు ఫిలాండర్ స్థానంలో అన్‌క్యాప్‌డ్ ఆల్‌రౌండర్ వియాన్ ముల్దార్‌ను తీసుకునే అవకాశాలున్నాయి. తొలి టెస్ట్‌లో తాము ఓడిపోతామని ఊహించలేదని గిబ్సన్ అన్నాడు. కుశాల్ పెరీరా, విశ్వ ఫెర్నాండో కలిసి వరల్డ్ రికార్డును సృష్టించడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు.

346

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles