ఫైనల్లో ముంబై రాకెట్స్


Sun,January 13, 2019 02:14 AM

Sameer-Verma
సెమీస్‌లో హైదరాబాద్ ఓటమి
బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ హంటర్స్ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన రెండో సెమీస్‌లో 4-2 స్కోరుతో ముంబై రాకెట్స్ జట్టు విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. సమీర్ వర్మ, ఆంటోన్‌సెన్ ఇద్దరూ పురుషుల సింగిల్స్‌లో విజయం సాధించడంతోపాటు లీ యోంగ్ డే, కిమ్ జింగ్ ఇద్దరూ మిక్స్‌డ్ డబుల్స్‌లో జట్టుకు గెలుపు అందించారు. హంటర్స్ జట్టు సింధు మ్యాచ్‌ను ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకుంది. ఈమ్యాచ్‌లో 15-6,15-5స్కోరుతో అంతగా అనుభవం లేని ముంబై షట్లర్ పర్దేశిని చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ మినహా మిగిలిన అన్ని మ్యాచ్‌లను హైదరాబాద్ ఓడిపోయింది. దీంతో టైటిల్ నిలుపుకోవాలన్న హైదరాబాద్ ఆశలు గల్లంతయ్యాయి. ఆదివారం జరిగే ఫైనల్లో బెంగళూరు రాఫ్టర్స్, ముంబై రాకెట్స్ జట్లు తలపడనున్నాయి.

146

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles