ఈ విజయం వారికి అంకితం


Thu,July 12, 2018 01:27 AM

Paul-Pogba
మాస్కో: ఫిఫా ప్రపంచకప్‌లో బెల్జియంతో సెమీఫైనల్ మ్యాచ్ విజయాన్ని ప్రమాదం నుంచి బయటపడ్డ థాయ్‌లాండ్ యువ సాకర్ జట్టుకు అంకితమిస్తున్నానని ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు పాల్ పోగ్బా అన్నాడు. బెల్జియంతో మ్యాచ్ ముగిసిన తర్వాత తన ట్విట్టర్‌లో థాయ్ బాలల ఫొటోను షేర్ చేస్తూ కామెంట్ చేశాడు. ఈ రోజు హీరోలు గా నిలిచిన మీ అం దరికీ చెందుతుంది ఈ విజయం. వెల్‌డన్ బాయ్స్, మీరు చాలా ధైర్యవంతులు అని ట్వీట్ చేశాడు. 18 రోజుల పాటు ఓ గుహలో చిక్కుకుని సుదీర్ఘ రెస్యూ ఆపరేషన్ ద్వారా థాయ్‌లాండ్‌కు చెందిన 12 మంది బాలురు, జట్టు కోచ్ మంగళవారం సురక్షితంగా బయటపడిన సంగతి తెలిసిందే.

అంబురాన్నంటిన సంబురాలు: బెల్జియంపై విజయాన్ని ఫ్రాన్స్ ఫ్యాన్స్ తనివీతీరా ఆస్వాదించారు. దేశ రాజధాని పారిస్ నగర వీధులన్నీ సాకర్ అభిమానులతో నిండిపోయాయి.

532

More News

VIRAL NEWS