ప్రదీప్‌ పంజా


Mon,October 7, 2019 03:34 AM

-ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌
నోయిడా: ‘డుబ్కీ కింగ్‌' ప్రదీప్‌ నర్వాల్‌ 34 పాయింట్లతో పంజా విసరడంతో పాట్నా పైరేట్స్‌ భారీ విజయం సాధించింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో పాట్నా 69-41 తేడాతో బెంగాల్‌ను చిత్తు చేసింది. ప్రదీప్‌ సహా రైడింగ్‌లో జంగ్‌కున్‌ లీ, ట్యాక్లింగ్‌లో నీరజ్‌ కుమార్‌ హైఫైలతో అదరగొట్టడంతో పాట్నా పని సులువైంది. బెంగాల్‌ జట్టులో రైడర్‌ సౌరభ్‌ పాటిల్‌ (11పాయింట్లు) ఒక్కడే సూపర్‌-10 సాధించగలిగాడు. మ్యాచ్‌ మొదట్లో కాసేపు వారియర్స్‌ ముందంజలో ఉన్నా.. ఆ తర్వాత పాట్నా స్టార్‌ ప్రదీప్‌ రెచ్చిపోవడంతో అసలు కోలుకోలేకపోయింది. ఈ క్రమంలో ఈ సీజన్‌లో 300పాయింట్ల మార్కు(302)ను ప్రదీప్‌ అధిగమించాడు. మరో మ్యాచ్‌లో యూపీ యోధా 43-39 తేడాతో పుణెరి పల్టాన్‌పై గెలిచింది.

298

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles