మనీశ్ సూపర్ సెంచరీ


Thu,July 18, 2019 03:55 AM

-విండీస్ ఎపై భారత్ ఎ భారీ విజయం
Manish-Pandey
నార్త్‌సౌండ్(అంటిగ్వా): కరీబియన్ పర్యటనలో భారత ద్వితీయ శ్రేణి జట్టు వరుస విజయాలతో దుమ్మురేపుతున్నది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన మూడో వన్డేలో భారత్ ఎ జట్టు 148 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఎపై భారీ విజయం సాధించింది. దీంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే ఐదు వన్డేల సిరీస్‌ను 3-0తో ముందంజ వేసింది. తొలుత టాస్ గెలిచిన టీమ్‌ఇండియా..కెప్టెన్ మనీశ్ పాండే (87 బంతుల్లో 100, 6ఫోర్లు, 5సిక్స్‌లు) సూపర్ సెంచరీకి తోడు శుభ్‌మన్ గిల్(77) అర్ధసెంచరీతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ఓపెనర్ అన్మోల్‌ప్రీత్‌సింగ్(0) డకౌట్‌గా నిరాశపరిచినా..గిల్, శ్రేయాస్ అయ్యర్(47) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

వీరిద్దరు కరీబియన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ రెండో వికెట్‌కు 109 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీర్దిదరు వెంటవెంటనే నిష్క్రమించడంతో క్రీజులోకొచ్చిన మనీశ్‌పాండే, హనుమ విహారి జతగా జోరు కొనసాగించాడు. మైదానం నలువైపులా స్వేచ్చగా షాట్లు ఆడుతూ స్కోరుబోర్డును పరిగెత్తించారు. ముఖ్యంగా మనీశ్ చూడచక్కని షాట్ల తో అలరించాడు. విహారితో కలిసి నాలుగో వికెట్‌కు 110 పరుగులు జోడించాడు. కార్న్‌వాల్(2/37), షెఫర్డ్(2/51) రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన విండీస్.. కృనాల్ పాండ్యా(5/25) స్పిన్ ధాటికి 34.2 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది. కీమోపాల్(34), సునీల్ అంబ్రిస్(30) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ఆటతీరు కనబరుచలేదు. విహారి(2/23)కి రెండు వికెట్లు దక్కాయి. సెంచరీతో జట్టు విజయంలో కీలకమైన మనీశ్‌పాండేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.

376

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles