పాక్‌ పరాజయం


Sun,October 6, 2019 01:52 AM

లాహోర్‌: సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న పాకిస్థాన్‌ టీ 20 సిరీస్‌ తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 64 పరుగుల తేడాతో ఓడింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన లంక 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఓపెనర్‌ గుణతిలక (57; 8ఫోర్లు, 1సిక్స్‌) అర్ధశతకం సాధించగా.. ఫెర్నాండో (33), రజపక్సే (32) ఫర్వాలేదనిపించారు. పాక్‌ బౌలర్లలో హస్నైన్‌ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్‌ 17.4 ఓవర్లలో 101 పరగులకు ఆలౌటైంది. ఇఫ్తిఖార్‌ (25) టాప్‌ స్కోరర్‌. లంక బౌలర్లలో ప్రదీప్‌, ఉడాన చెరో 3 వికెట్లు పడగొట్టారు.

361
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles