గెలుపు కంటే దేశ గౌరవం ముఖ్యం: టిమ్ పైనీ


Thu,December 6, 2018 12:14 AM

అడిలైడ్: ప్రత్యర్థిపై గెలుపు కంటే దేశ గౌరవమే తనకు ముఖ్యమని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనీ అన్నాడు. అక్రమ మార్గాలు అనుసరిస్తూ సాధించే విజయానికంటే...పోరాడి ఓడి అందరి హృదయాలు గెలుచుకోవడం బాగుంటుందని పెయిన్ చెప్పుకొచ్చాడు. ప్రపంచ క్రికెట్ ఓ కుదుపు కుదిపిన బాల్ ట్యాంపరింగ్ వివాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆసీస్ జట్టు క్రికెటర్లు దేశ గౌరవాన్ని ఇనుమడింపచేసేందుకు తహతహలాడుతున్నారు. భారత్ అడిలైడ్ మొదలయ్యే తొలి టెస్ట్ కోసం బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పైనీ మాట్లాడుతూ ‘హృదయాలతో పాటు మ్యాచ్ గెలిచేందుకు మేమిక్కడ ఉన్నాం. అందులో ఎలాంటి సందేహం లేదు. బాల్ ట్యాంపరింగ్ మసకబారిన దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేయాలనుకుంటున్నాం.

కొన్ని విషయాల్లో ఇంకా మెరుగు కావాల్సిన అవసరముంది. వాటిపై దృష్టి పెట్టాం. ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. నాకు దక్కిన ఈ అవకాశాన్ని వృథా చేసుకోలేను. భారత్ తొలి టెస్ట్ పైచేయి సాధించేందుకు నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగుతాం. గాయం నుంచి తేరుకున్న పేసర్ ప్యాట్ కమ్మిన్స్ జట్టులోకి రావడంతో బౌలింగ్ బలంగా మారింది. ఫామ్ కారణంగా ఆల్ మిచెల్ మార్ష్ అడిలైడ్ టెస్ట్ నుంచి తప్పించడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఫామ్ తడబడటం కారణంగా జాతీయ జట్టుకు మిచెల్ ఎంపిక కాలేకపోయాడు. కానీ త్వరలోనే అతను తిరిగి జట్టులోకి వస్తాడన్న నమ్మకముంది. మిచెల్ స్థానంలో మార్కస్ హ్యారిస్ అరంగేట్రం చేయబోతున్నాడు’ అని పైనీ అన్నాడు.

206

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles