లిఫ్టర్లకు ప్రభుత్వ ప్రోత్సాహం


Wed,September 13, 2017 01:22 AM

deekshita
కామన్వెల్త్ పతక విజేతలకు క్రీడామంత్రి హామీ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఖేల్ ప్రతినిధి: గతవారం ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాలు సాధించిన రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ (హకీంపేట్) విద్యార్థినులైన దీక్షిత, రాగాల వెంకట రాహుల్, వరుణ్‌లను క్రీడాశాఖ మంత్రి పద్మారావు అభినందించారు. లిఫ్టర్లు, కోచ్‌తో పాటు స్పోర్ట్స్‌స్కూల్ డైరెక్టర్ నర్సయ్య మంగళవారం సచివాలయంలోని క్రీడామంత్రి కార్యాలయానికి వెళ్లి పద్మారావును కలుసుకున్నారు.

అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తున్న లిఫ్టర్లు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు అందుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వెయిట్‌లిఫ్టర్లకు ప్రభుత్వం తరపున అన్నివిధాలా ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. లిఫ్టర్లతో పాటు క్రీడాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, సాట్స్ ఎండీ దినకర్‌బాబు కూడా మంత్రిని కలుసుకున్న వారిలో ఉన్నారు.

202

More News

VIRAL NEWS