మహిళల ప్రపంచ కప్ విజేతకు రూ. 4.25 కోట్లు

Mon,June 19, 2017 02:07 AM

లండన్: ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలిచిన జట్టు పంట పండినట్లే. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి మహిళల ప్రపంచకప్ విజేత ప్రైజ్‌మనీని భారీగా పెంచారు. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు ఏకంగా రూ. 4.25 కోట్లు అందుకోనుంది. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ. 2.12 కోట్లు దక్కనున్నాయి. ఈ మేరకు ఐసీసీ టోర్నీ ప్రైజ్‌మనీని ఆదివారం ప్రకటించింది. మహిళల ప్రపంచకప్ ఈనెల 24 నుంచి వచ్చేనెల 23 వరకు లండన్ వేదికగా జరుగనుంది. గత ప్రపంచకప్ (2013)తో పోలిస్తే ఈసారి ప్రైజ్‌మనీని పదిరెట్లు పెంచారు. గ్రూప్ దశ చేరిన జట్టుకు రూ. 19.30 లక్షలు అందుతాయి. సోమవారం నుంచి వామప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలిరోజు వామప్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో శ్రీలంక, న్యూజిలాండ్‌తో భారత్ తలపడనున్నాయి.

154

More News

మరిన్ని వార్తలు...