ఏఏఏ సభ్యురాలిగా పీటీ ఉషా


Wed,August 14, 2019 01:18 AM

న్యూఢిల్లీ: పరుగుల రాణి పీటీ ఉషా ఆసియా అథ్లెటిక్ అసోసియేషన్ (ఏఏఏ) అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా ఎంపికైంది. 55 ఏండ్ల ఉషా ఆరుగురు సభ్యుల కమిషన్‌లో చోటు దక్కించుకుంది. దీనికి ఉజ్బేకిస్థాన్‌కు చెందిన ఒలింపిక్ స్వర్ణ పతక విజేత ఆండరే అబ్దువలియేమ్ అధ్యక్షత వహించనున్నాడు. ఏఏఏ అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా అవకాశం రావడంతో మరో ఆలోచన లేకుండా అంగీకరించా. ఇది నాకు, దేశానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నా అని ఆమె పేర్కొంది. లాస్ ఏంజిల్స్ (1984) ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హర్డిల్స్‌లో సెకన్లో వందో వంతుతో కాంస్య పతకం కోల్పోయిన ఉషా తన జమానాలో అత్యుత్తమ అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. 1986 ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణాలు సహా ఐదు పతకాలు నెగ్గిన ఉషా.. ఆసియా చాంపియన్‌షిప్‌లో ఐదు స్వర్ణాలతో సత్తాచాటింది.

251

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles