మన క్రీడాకారులు ఒలింపిక్స్‌కు ఎదగాలి


Sat,May 20, 2017 12:45 AM

Padmarao
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఖేల్ ప్రతినిధి: గ్రామీణ క్రీడాకారులను ఒలింపిక్స్ స్థాయికి తీసుకురావడం కోసం కృషి చేయాలని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి పద్మారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్రీడలు, యువజన శాఖ వ్యవహారాలపై ఆ శాఖ మంత్రి పద్మారావు ఆయన చాంబర్‌లో ఉన్నతాధికారులతో క్రీడా సమీక్ష నిర్వహించారు. మఖ్యంగా క్రీడాశాఖలో ఏండ్లుగా పనిచేస్తున్న కోచ్‌ల జీతభత్యాల గురించి చర్చించారు. అంతేకాదు నిర్మాణంలో ఉన్న స్టేడియాల పని ఎంతవరకు వచ్చిందన్న విషయాన్ని మంత్రి అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. మన రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకర చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గ్రామీణస్థాయిలోని క్రీడాకారులకు ప్రోత్సాహం అందించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. టోక్యో ఒలింపిక్స్ పతకాలే లక్ష్యంగా క్రీడాకారులను తయారు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతిజిల్లాకు ఐదుగురు కోచ్‌లు ఉండేలా ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ కోచ్‌లను క్రమబద్ధీకరించుకోవాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారిని కలిసి ఈరోజు చర్చించిన అంశాలను వివరించి క్రీడాకారులకు, అధికారులకు కావలసిన అన్ని సౌకర్యాలను అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు పాపారావు, రమణారావు, క్రీడా కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, సాట్స్ ఎండీ దినకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

175

More News

VIRAL NEWS