గోల్ లేకుండానే డ్రా


Tue,October 22, 2019 12:49 AM

బెంగళూరు : ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఆరో సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు ఎఫ్‌సీ తన తొలి మ్యాచ్‌ను డ్రాగా ముగించుకుంది. సోమవారం ఇక్కడి కంఠీరవ స్టేడియంలో బెంగళూరు - నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ మధ్య జోరు వానలో హోరాహోరీ పోరు జరగగా చివరికు 0-0తో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలో గోల్ చేసేందుకు వచ్చిన అవకాశాలను బెంగళూరు చేజార్చుకుంది. నార్త్‌ఈస్ట్ జట్టు దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినా... అతిథ్య జట్టు ఢిఫెన్స్‌ను మాత్రం ఛేదించలేకపోయింది. 21వ నిమిషంలో యునైటెడ్ ఆటగాడు మార్టిన్ చేవ్స్ బలమైన షాట్ కొట్టగా.. గోల్ కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధు డైవ్ కొట్టి అద్భుతంగా ఆడ్డుకున్నాడు. ఆ తర్వాత తొలి అర్ధభాగం గోల్ లేకుండానే ముగిసింది. 53వ నిమిషంలో నార్త్‌ఈస్ట్ ప్లేయర్ అశామో గ్యాన్ అద్భుతమైన షాట్ కొట్టగా.. బంతి గోల్‌కోర్టు బార్‌కి తగిలి వెనక్కి వచ్చింది. ఆ తర్వాత గోల్ చేసేందుకు వచ్చిన అవకాశాన్ని బెంగళూరు కెప్టెన్ సునీల్ ఛెత్రి సైతం సద్వినియోగం చేసుకోలేకపోవడంతో చివరికి మ్యాచ్ డ్రాగా ముగిసింది.

515

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles