అంతా ప్రొటోకాల్ ప్రకారమే!


Fri,August 10, 2018 12:32 AM

-అనుష్క, కోహ్లీ తప్పేం లేదు..
-బీసీసీఐ వివరణ
kohli-anushka
లండన్: భారత హైకమిషన్ కార్యాలయం ఎదుట టీమ్ ఇండియా జట్టు సభ్యుల ఫొటో వివాదంపై బీసీసీఐ వివరణ ఇచ్చింది. భారత హైకమిషన్ క్రికెటర్లు, వారి బంధువులను సాదరపూర్వకంగా ఆహ్వానించిందని, అందుకే అనుష్క..కొహ్లీతో కలిసి వచ్చిందని తెలిపింది. టీమ్ ఇండియా క్రికెటర్లతోపాటు వారి కుటుంబ సభ్యులను సైతం భారత హైకమిషన్ ఆహ్వానించింది. అందుకే అనుష్క హాజరైంది. ఫొటో దిగే సమయంలోనూ ఆటగాళ్లు ఎలాంటి ప్రొటోకాల్ ఉల్లంఘించలేదు. ఆటగాళ్లు ఎవరితోనైనా ఫొటో దిగొచ్చు. లండన్‌లో జరిగే మ్యాచ్‌లకు వారి కుటుంబసభ్యులతో హాజరుకావచ్చు. ఇందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. రిసెప్షన్ వేడుకలో పాల్గొనాలంటూ భారత హైకమిషనర్ భార్య ఆహ్వానం మేరకు అనుష్క హాజరైంది. ఇక రహానేను ఎవరూ వెనక్కి వెళ్లి ఫొటో దిగమని అడగలేదు. అతను ఇష్టపూర్వకంగానే వెళ్లాడు. హైకమిషనర్ ఇంట్లోకి వెళ్లేముందు అందరూ ఇలా ఫొటో దిగారు అని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు వెల్లించారు. భారత హైకమిషన్ కార్యాలయం ఎదుట టీమ్ ఇండియా అధికారిక కార్యక్రమంలో అనుష్క హాజరవడంపై సామాజిక మాధ్యమాల్లో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అనుష్క టీమ్ ఇండియా వైస్ కెప్టెనా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించడంతో బీసీసీఐ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

403

More News

VIRAL NEWS