ఎవరూ ఓడిపోలేదు


Wed,July 17, 2019 02:26 AM

image
వెల్లింగ్టన్: ప్రపంచకప్ ఫైనల్లో బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుంటే... మరోవైపు క్రీడాస్ఫూర్తి ప్రదర్శించిన న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్‌పై ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఈ నేపథ్యంలో విశ్వటోర్నీ ఫైనల్‌పై విలియమ్సన్ స్పందించాడు. రెండు జట్ల మధ్య ఏదీ భేదాన్ని తేల్చలేకపోయింది. ఫైనల్‌లో ఎవరూ ఓడిపోలేదు. కాకపోతే ఎవరికో ఒకరికి టైటిల్ దక్కాలి. అదే జరిగింది అని విలియమ్సన్ అన్నాడు. ఓటమిని అంగీకరించిన తీరుపై వస్తున్న ప్రశంసల పట్ల స్పందిస్తూ తాము ఐసీసీ నిబంధనలకు కట్టుబడి ఉన్నామని అన్నాడు. ఇక బౌండరీల లెక్కింపు నిబంధనపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ మాట మీరు అడగాల్సి వస్తుందని, నేను సమాధానం చెప్పా ల్సి వస్తుందని ఇంతకు ముందెప్పుడూ అస్సలు ఊహించలేదు. తుదిపోరులో ఓటమిని దిగమింగ డం చాలా కష్టం, అయితే రెండు జట్లు ఫైనల్‌కు వచ్చేందుకు ఎంతో శ్రమించాయి. ఇరు జట్ల మధ్య భేదా న్ని తేల్చేందుకు రెండు ప్రయత్నాలు జరిగాయి, అయినా ఏదీ తేలలేదు అని విలియమ్సన్ అన్నాడు.

725

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles